విషాదం.. గుండెపోటుతో బ్రెజిల్ ప్లేయర్ మృతి
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:43 PM
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో (34) గుండెపోటుతో కన్నుమూశాడు. సోమవారం ఉదయం నిద్రలోనే అలన్ తుదిశ్వాస విడిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన 34 ఏళ్ల యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో గుండెపోటుతో మరణించాడు. సోమవారం ఉదయం నిద్రలోనే అలన్ తుదిశ్వాస విడిచినట్లు యూఎఫ్‌సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫ్లైవెయిట్ విభాగంలో అతడి చివరి పోరాటం జూన్‌లో జరిగింది. అందులో మిచ్ రాపోసో చేతిలో అలన్ ఓడిపోయాడు.
యూఎఫ్‌సీ తెలిపిన వివరాల ప్రకారం... అలన్‌కు సోమవారం తెల్లవారుజామున నిద్రలోనే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారంతో వైద్యులు వచ్చి సీపీఆర్ చేశారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ) కెరీర్‌లో ఫైటర్‌గా 22 విజయాలు, 7 ఓటములను చవిశాడు.
గతంలో కోచ్ డియెగో లిమా వద్ద నాసిమెంటో శిక్షణ తీసుకున్నాడు. ఈ సమయంలోనే మాజీ యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఛాంపియన్ చార్లెస్ ఒలివెరా, యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఎల్వెస్ బ్రెనర్‌తో సహా పలువురు స్టార్ బ్రెజిలియన్ ఫైటర్లతో తలపడ్డాడు. మరోవైపు యూఎఫ్‌సీ అలన్ నాసిమెంటో చేసిన ఎంఎంఏ ఫైటర్‌గా సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలన్ ఒక నైపుణ్యం ఉన్న క్రీడాకారుడని, పరిపూర్ణ ఎంఎంఏ ఫైటర్ అని కొనియాడింది. అలాన్ తన పట్టుదల, వినయం, గౌరవం, పోరాట స్ఫూర్తితో అందరికీ స్ఫూర్తినిచ్చాడని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: భారత్ వైదొలిగితే.. యువ పేసర్లకు బీసీసీఐ ఛాన్స్!
ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్