మనోహర్‌రెడ్డికి ‘ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్-2026’
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:01 PM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్నాలజీ ప్రొఫెషనల్ మనోహర్‌రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. సింగపూర్ వేదికగా నిర్వహించిన ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్స్- 2026లో ఆయన విజేతగా ఎంపికయ్యారు.
సింగపూర్: తెలుగు రాష్ట్రాలకు చెందిన టెక్నాలజీ ప్రొఫెషనల్ మనోహర్‌రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. సింగపూర్ వేదికగా నిర్వహించిన ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్స్- 2026లో ఆయన విజేతగా ఎంపికయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స్, డేటా ఇంజినీరింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి ఈ పురస్కారం దక్కింది.
సాంకేతిక రంగంలో విశేష కృషి..
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ, నాయకత్వం, ఆవిష్కరణలు, సామాజిక, వృత్తిపరమైన ప్రభావాన్ని చూపుతున్న ప్రవాస భారతీయులను గుర్తించి సత్కరించేందుకు ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్స్ వేదికగా నిలుస్తోంది. ఈ క్రమంలో సింగపూర్‌లో జరిగిన అవార్డు కార్యక్రమంలో మనోహర్‌రెడ్డికి ఈ గుర్తింపు లభించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా ఇంజినీరింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో పనిచేస్తున్న మనోహర్‌రెడ్డి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంక్లిష్టమైన వాస్తవ ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్నారు.
వరుసగా అంతర్జాతీయ గుర్తింపులు..
ఇదివరకే యూకే ఐటీ ఇండస్ట్రీ అవార్డ్స్‌లో ఫైనలిస్ట్‌గా ఎంపికైన మనోహర్‌రెడ్డి.. తాజాగా ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్స్- 2026ను సొంతం చేసుకోవడం విశేషం. టెక్నాలజీ రంగంలో ఆయన నైపుణ్యం, కృషి, ఆవిష్కరణలకు గుర్తింపుగా నిలుస్తున్నాయి.
యువతకు స్ఫూర్తిగా..
అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మనోహర్‌రెడ్డి విజయాలు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయులకు గర్వకారణంగా నిలుస్తున్నాయి. సాంకేతిక రంగంలో భారతీయ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుకుంటున్న నేపథ్యంలో.. మనోహర్‌రెడ్డి ప్రయాణం యువతకు స్ఫూర్తినిచ్చేలా కొనసాగుతోంది.
అదే నా లక్ష్యం: మనోహర్ రెడ్డి
‘అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభకు గుర్తింపు లభించడం ఎంతో గర్వకారణం. సాంకేతిక రంగంలో నిరంతరం నేర్చుకుంటూ, ఆవిష్కరణలను కొనసాగిస్తూ.. నా కృషి ద్వారా యువతకు స్ఫూర్తినివ్వడం, నా దేశానికి గర్వకారణంగా నిలవడం నా లక్ష్యం’ అని మనోహర్‌రెడ్డి తెలిపారు.