టీ20 ప్రపంచ కప్ 2026 : విశ్వవిజేతగా భారత్
ABN , Publish Date - Mar 08 , 2026 | 10:57 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండో సారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడు సార్లు పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండో సారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడు సార్లు పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. అచ్చిరాదన్న అహ్మదాబాద్ స్టేడియంలో సూర్యసేన.. కివీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగిన వేళ.. కివీస్ చిత్తు అయింది. 256 పరుగుల ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. 159కే ఆలౌటైంది.
టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల ఛేదనలో కివీస్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టిమ్ సీఫర్ట్(52), కెప్టెన్ శాంట్నర్(43) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. టీమిండియా బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. బుమ్రా 4, అక్షర్ పటేల్ 3, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలొక వికెట్ పడగొట్టారు.
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లకు చల్లటి సాయంత్రం వేళ ముచ్చెమటలు పట్టించారు. అభిషేక్ శర్మ(52), సంజు శాంసన్(89), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో వచ్చిన దూబే(26*) మెరిపించాడు. బ్యాటర్ల విధ్వంసానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో నీషమ్ 3, రచిన్ రవీంద్ర, హెన్రీ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..
మారిన ఐపీఎల్ 2026 ప్రారంభం తేదీ..