Share News

ఫైనల్‌కు స్టార్‌ క్రికెటర్లు

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:37 AM

స్టార్‌ ఆటగాళ్ల చేరికతో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆసక్తికరంగా మారనుంది. సోమవారం నుంచి స్థానిక చిదంబరం స్టేడియంలో సౌత్‌జోన్‌-ఈ;జోన్‌ జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరుగనుంది.

ఫైనల్‌కు స్టార్‌ క్రికెటర్లు

చెన్నై: స్టార్‌ ఆటగాళ్ల చేరికతో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆసక్తికరంగా మారనుంది. సోమవారం నుంచి స్థానిక చిదంబరం స్టేడియంలో సౌత్‌జోన్‌-ఈ;జోన్‌ జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత టెస్టు ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ సిరాజ్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌లను సౌత్‌జోన్‌ జట్టులో చేర్చారు. ఈ మ్యాచ్‌ ద్వారా వీరికి చక్కటి ప్రాక్టీస్‌ లభించినట్టవుతుందని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. సెమీస్‌లో పేసర్‌ విద్వత్‌ కావేరప్ప గాయపడడంతో సిరాజ్‌ చేరిక జట్టు బౌలింగ్‌ బలాన్ని పెంచనుంది. అలాగే అతడి కవరప్‌గా మరో హైదరాబాదీ పేసర్‌ సీవీ మిలింద్‌ను కూడా ఎంపిక చేశారు.

ఈ వార్తలను కూడా చదవండి

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

Updated Date - Sep 05 , 2026 | 01:37 AM