Share News

సిరాజ్‌కు విశ్రాంతి.. జట్టులోకి స్టార్ పేసర్

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:38 PM

భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసింది.

సిరాజ్‌కు విశ్రాంతి.. జట్టులోకి స్టార్ పేసర్
Mohammed Siraj

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి స్థానంలో మరో స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసింది.


‘వైద్య బృందం, జట్టు యాజమాన్యంతో చర్చించిన అనంతరం సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇటీవలి ప్రదర్శనల ఆధారంగా ప్రసిద్ధ్ కృష్ణను సిరాజ్ స్థానంలో భర్తీ చేశాం’ అని బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జూన్ 26 నుంచి భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 నుంచి జులై 11 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల్లో తలపడనుంది. దీనికి సంబంధించి తొలుత ప్రకటించిన జట్టులో సిరాజ్‌కు చోటు దక్కింది. కానీ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా అతడిని తప్పించి ప్రసిద్ధ్ కృష్ణను బీసీసీఐ తాజాగా ఎంపిక చేసింది.


ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టు

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబె, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ


ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 09 , 2026 | 03:51 PM