Share News

షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని సంజూ, శ్రీశాంత్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:58 AM

శ్రీశాంత్‌, సంజూ శాంసన్‌.. కేరళకు చెందిన ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య ఏం జరుగుతున్నదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదివారం కేరళ క్రికెట్‌ లీగ్‌ ఫైనల్‌ ముగిశాక విజేతలకు అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.

షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని సంజూ, శ్రీశాంత్‌

తిరువనంతపురం: శ్రీశాంత్‌, సంజూ శాంసన్‌.. కేరళకు చెందిన ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య ఏం జరుగుతున్నదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదివారం కేరళ క్రికెట్‌ లీగ్‌ ఫైనల్‌ ముగిశాక విజేతలకు అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో కొల్లాం సెయిలర్స్‌ జట్టుకు ఫెయిర్‌ప్లే అవార్డు రాగా.. దాన్ని అందుకునేందుకు సహ యజమాని అయిన శ్రీశాంత్‌ వేదికపైకి వచ్చాడు. అయితే అక్కడే ఉన్న సంజూ శాంసన్‌ను పట్టించుకోకుండా మిగతా వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన శ్రీశాంత్‌ అవార్డు తీసుకుని వెళ్లిపోయాడు. అటు శ్రీశాంత్‌ వేదికపైకి వస్తున్నా వరుసలో అందరికంటే ముందున్న సంజూ చేతులు వెనకాలే పెట్టుకుని నిల్చున్నాడు. అంతేకాదు...అతను కనీసం శ్రీశాంత్‌ వైపు చూడనుకూడా చూడలేదు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో శాంసన్‌ను విమర్శిస్తూ శ్రీశాంత్‌ మాట్లాడిన విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి

55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

Updated Date - Sep 08 , 2026 | 01:58 AM