Share News

ప్రధాని మోదీని కలిసి పెళ్లికి ఆహ్వానించిన రింకూ సింగ్

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:18 PM

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని ఆదివారం కలిశాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో జరగనున్న వివాహ వేడుకకు హాజరవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశాడు.

ప్రధాని మోదీని కలిసి పెళ్లికి ఆహ్వానించిన రింకూ సింగ్
Rinku Singh

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని ఆదివారం కలిశాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో జరగనున్న వివాహ వేడుకకు హాజరవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశాడు. ప్రధానిని కలిసి శుభలేఖ అందించిన ఫొటోను రింకూ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇది తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నాడు.


రింకూ సింగ్‌, ప్రియా సరోజ్‌ వివాహ వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 4న లఖ్‌నవూలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఇరు కుటుంబ సభ్యులు ఆహ్వానాలు అందిస్తున్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా రింకూ కుటుంబ సభ్యులు కలిసి పెళ్లికి ఆహ్వానించారు. క్రికెట్‌, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, రింకూ-ప్రియా నిశ్చితార్థం 2025 జూన్‌ 8న లఖ్‌నవూలోనే జరిగిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్

డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ

Updated Date - Nov 15 , 2026 | 08:18 PM