సింధు.. రన్నరప్‌తో సరి
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:15 AM
సీనియర్ షట్లర్ పీవీ సింధు ఈ సీజన్‌లో మరో సూపర్ 750 బ్యాడ్మిం టన్ టోర్నీ టైటిల్ దక్కించుకొనే అవకాశం త్రుటిలో కోల్పోయింది...
ఫైనల్లో పోరాడి ఓడిన భారత షట్లర్
అన్ సే యంగ్‌దే ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: సీనియర్ షట్లర్ పీవీ సింధు ఈ సీజన్‌లో మరో సూపర్ 750 బ్యాడ్మిం టన్ టోర్నీ టైటిల్ దక్కించుకొనే అవకాశం త్రుటిలో కోల్పోయింది. పారిస్ ఓపెన్‌లో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 31 ఏళ్ల సింధు 21-16, 11-21, 12-21తో చిరకాల ప్రత్యర్థి, వరల్డ్ నెం.1 అన్ సే యంగ్ (దక్షిణకొరియా) చేతిలో ఓడింది. ఒలింపిక్ చాంపియన్ అన్ సే యంగ్‌కు ఇది నాలుగో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఇక్కడ విజేతగా నిలవడం ఆమెకిది వరుసగా మూడోసారి. అలాగే అన్ సే యంగ్‌కిది వరుసగా 50వ మ్యాచ్ విజయం కావడం విశేషం. ఈ సీజన్‌లో ఆమెకిది 11వ టైటిల్. మరోవైపు సింధు గత జూలైలో జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News