Share News

పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:03 AM

భారత యువ క్రికెటక్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం అతడి కాబోయే భార్య ఆకృతి అగార్వల్ ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ ఈ చర్చకు దారితీసింది. తాజాగా ఆకృతి ఈ విషయంపై స్పందించారు.

పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ
Prithvi Shaw breakup rumours

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటక్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం అతడి కాబోయే భార్య ఆకృతి అగార్వల్ ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ ఈ చర్చకు దారితీసింది. ఎవరు పేరును ప్రస్తావించకుండా.. ‘నేను మోసపోయా. అతడితో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇదంతా జరిగింది. అతడి గురించి నెట్టింట వస్తోన్న రూమర్స్ అన్నీ నిజాలే’ అంటూ ఆకృతి ఓ పోస్ట్ పెట్టారు. దీని తర్వాత పృథ్వీ షాతో బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆకృతి ఈ విషయంపై స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పృథ్వీ షాపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదని, తాము సంతోషంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.


‘నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. నేను నాకు కాబోయే భర్త పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. మా ఎంగేజ్‌మెంట్ రద్దు అయిందని గానీ, మేమిద్దరం విడిపోయామని గానీ చెప్పలేదు. కానీ నేను పెట్టిన పోస్ట్ పృథ్వీ గురించే అని చాలామంది భావించడం బాధాకరం. మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నాం. మా బంధం కొనసాగుతుంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠ, గౌరవం ఎంత సులువుగా దెబ్బతింటాయో ఈ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. నేను పెట్టిన ఆ స్టోరీ నా క్లోజ్ ఫ్రెండ్స్‌ను ఉద్దేశించినది. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల నేను ప్రేమించే వ్యక్తి పరువు కోల్పోవాల్సి వచ్చింది. ఆ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టానో నేను చెప్పను. నాకు నాపై నమ్మకం ఉంది. దేవుడే సరైన సమయంలో న్యాయం చేస్తాడు’ అని ఆకృతి ఇన్‌స్టాలో వివరించారు. ఈ ఏడాది మార్చిలో పృథ్వీ షా, ఆకృతి నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో

ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ ఔట్.. ముగిసిన రొనాల్డో ప్రయాణం

Updated Date - Jul 07 , 2026 | 11:04 AM