భార్యతో గొడవపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇదే!
ABN , Publish Date - Nov 14 , 2026 | 09:55 AM
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆయన భార్య బెకి మధ్య గొడవ జరిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ రోడ్డుపై కోపంగా మాట్లాడుకుంటున్నట్టు కనిపించడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందనే ప్రచారం మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆయన భార్య బెకి మధ్య గొడవ జరిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ రోడ్డుపై కోపంగా మాట్లాడుకుంటున్నట్టు కనిపించడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందనే ప్రచారం మొదలైంది. ఈ వీడియోపై తాజాగా స్పందించిన కమిన్స్ అసలు విషయం వెల్లడించాడు. తాము గొడవ పడలేదని, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాపై తన భార్య బెకి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని స్పష్టం చేశాడు (Pat Cummins Viral Video).
సిడ్నీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఈ వీడియో గురించి మాట్లాడాడు. తమ మధ్య గొడవ ఏమీ జరగలేదని చెప్పాడు. ఉస్మాన్ ఖవాజా ఇటీవల తన ఆత్మకథ 'సబ్ర్'లో చేసిన వ్యాఖ్యలపై బెకి తీవ్ర అసంతృప్తితో ఉందని వెల్లడించాడు (Usman Khawaja Book). తమ మధ్య జరిగిన సంభాషణను గొడవగా చిత్రీకరించడం సరికాదన్నాడు. బెకి తన భావాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుందని, ఖవాజా చేసిన వ్యాఖ్యలపై ఆమె చాలా కోపంగా, అసహనంగా ఉందని వివరించాడు. అంతేకాదు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోను చిత్రీకరించి బహిరంగంగా ప్రచారం చేయడంపై కూడా కమిన్స్ అసహనం వ్యక్తం చేశాడు.
2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా జట్టులో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ప్రస్తావించాడు (Sandpapergate Controversy). బంతి ఆకారాన్ని అక్రమంగా మార్చే ప్రయత్నం గురించి జట్టులోని పలువురికి తెలుసనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కేవలం ముగ్గురు ఆటగాళ్లపైనే చర్యలు తీసుకోవడం వెనుక ఉన్న పరిణామాలను కూడా ప్రశ్నించాడు. ఈ ఆరోపణలను కమిన్స్ తీవ్రంగా ఖండించాడు. ఖవాజా తనకు స్నేహితుడేనని, అయితే ఇతరుల జీవితాలు, ప్రతిష్ఠకు సంబంధించిన విషయాలను బాధ్యత లేకుండా ప్రస్తావించడం సరికాదని వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి..
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..
పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..