Share News

సెమీస్‌కు పాక్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:39 AM

పాకిస్థాన్‌ జట్టు మహిళల టీ20 ఆసియాకప్‌ సెమీస్‌కు చేరింది. సోమవారం గ్రూప్‌-ఎలో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ 72 పరుగులతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన పాక్‌.. శుక్రవారం జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.

సెమీస్‌కు పాక్‌

ఆసియాకప్‌లో హాంకాంగ్‌పై విజయం

దుబాయ్‌: పాకిస్థాన్‌ జట్టు మహిళల టీ20 ఆసియాకప్‌ సెమీస్‌కు చేరింది. సోమవారం గ్రూప్‌-ఎలో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ 72 పరుగులతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన పాక్‌.. శుక్రవారం జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. మొదట పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. జాయ్‌లీన్‌ కౌర్‌ 4 వికెట్లు పడగొట్టగా.. కారీ చాన్‌, ఇక్రా చెరో రెండు వికెట్లు తీశారు. ఓపెనర్‌ షవ్వాల్‌ జుల్ఫికర్‌ (47), ఆయేషా (26), కెప్టెన్‌ ఫాతిమా సనా (24 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో హాంకాంగ్‌ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కారీ చాన్‌ (30) టాప్‌ స్కోరర్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నష్రా సంధు ఆరు వికెట్లు కూల్చింది.

ఈ వార్తలనూ చదవండి

55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

Updated Date - Sep 08 , 2026 | 01:43 AM