Share News

స్వర్ణానికి అడుగు దూరం.. రెజ్లింగ్ ఫైనల్‌కి మనీషా బన్వాలా

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:42 PM

భారత రెజ్లర్ మనీషా బన్వాలా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్-2026లో మనీషా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

స్వర్ణానికి అడుగు దూరం.. రెజ్లింగ్ ఫైనల్‌కి మనీషా బన్వాలా
Manisha Bhanwala

స్పోర్ట్స్ డెస్క్: భారత రెజ్లర్ మనీషా బన్వాలా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్-2026లో మనీషా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ(గురువారం) 59 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్‌లో కజకిస్థాన్ రెజ్లర్ అల్టిన్ పగాయేవాను 10-0 తేడాతో మనీషా చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో స్వర్ణ పతక పోరుకు 29 ఏళ్ల ఈ భారత రెజ్లర్ అర్హత సాధించింది. రేపు(శుక్రవారం) జరగనున్న తుదిపోరులో అమెరికా రెజ్లర్ అబిగైల్ నెట్టెతో మనీషా తలపడనుంది.


ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్-2026 ఫైనల్ పోరులో విజయం సాధిస్తే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి రెజ్లర్‌గా మనీషా బన్వాలా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు 72 కేజీల విభాగంలో తను శర్మ కాంస్యంతో సరిపెట్టుకుంది. తను కాంస్య పతక పోరులో 9-5 తేడాతో యూఎస్ఏకు చెందిన అథ్లెట్ ప్రెషియస్ బెల్‌ను ఓడించింది. ఈ టోర్నీలో 76 కేజీల విభాగంలో కాజల్ దోచక్, 50 కేజీల విభాగంలో నీలమ్ సిరోహి రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో, క్వార్టర్ ఫైనల్స్‌లో భారత అథ్లెట్ విక్కీ (97 కేజీలు) జపాన్‌కు చెందిన అరశ్ యోషిడా చేతిలో 12-2 తేడాతో ఓడిపోయాడు.


ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 29 , 2026 | 09:51 PM