Share News

టికెట్ రేట్లు పెంచక తప్పదు: ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:26 PM

విమాన టికెట్ రేట్లు పెంచకతప్పదని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సీఈఓ తాజాగా వ్యాఖ్యానించారు. తగ్గిన రూపాయి మారకం విలువ, పెరిగిన ఇంధన ఖర్చులతో సంస్థపై ఆర్థికంగా భారం పెరిగిందని చెప్పారు.

టికెట్ రేట్లు పెంచక తప్పదు: ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ
Indigo Airfare Hike

ఇంటర్నెట్ డెస్క్: విమాన టికెట్ రేట్లు పెంచక తప్పదని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సీఈఓ విల్లీ వాల్ష్ తాజాగా చెప్పారు. తగ్గిన రూపాయి మారకం విలువ, పెరిగిన ఇంధన ఖర్చులతో సంస్థపై ఆర్థికంగా భారం పెరిగిందని తెలిపారు. రేట్లు పెంచడం మినహా మరో మార్గం తమకు లేదని అన్నారు. అయితే, పెంపు భారం వీలైనంత తక్కువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.1879 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలు తగ్గినా కార్యనిర్వహణ ఖర్చులు పెరగడంతో సంస్థ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడింది. ఖర్చుల భారం పెరుగుతున్నా టికెట్ ధరల పెంపు వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామని ఇండిగో సీఈఓ భరోసా ఇచ్చారు. టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా తాము అనుసరిస్తున్న విధానం వల్ల దేశంలో వైమానిక రంగ మార్కెట్ విస్తరించిందని చెప్పారు.


పశ్చిమాసియా ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఎయిర్‌లైన్స్‌పై ఇంధన ఖర్చుల భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్లపై ఇంధన సర్‌చార్జ్ విధించే అంశాన్ని కొన్ని ఎయిర్‌లైన్స్ పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇండిగో ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.24,311.9 కోట్లుగా ఉంది. ఖర్చులు మాత్రం రూ.26,188 కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో ఇంధన ఖర్చు 67.2 శాతం మేర పెరిగి రూ.9,966.8 కోట్లకు చేరింది.


ఈ వార్తలనూ చదవండి:

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే రూ. 26 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, 22,850 దాటిన నిఫ్టీ

Updated Date - Oct 29 , 2026 | 09:34 PM