Share News

ప్రీక్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:33 AM

హైలో ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో లక్ష్యసేన్‌, మాళవిక బన్సోడ్‌, ఉన్నతి హుడా, ఇషారాణి బారువా, అన్మోల్‌ ఖర్బ్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు.

ప్రీక్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌
Lakshya Sen

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో లక్ష్యసేన్‌, మాళవిక బన్సోడ్‌, ఉన్నతి హుడా, ఇషారాణి బారువా, అన్మోల్‌ ఖర్బ్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. బుధవారం జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 16-21, 21-9, 21-13తో జొకిపమ్‌పై, మాళవిక 18-21, 21-19, 21-14తో దేవికా సిహాగ్‌పై, ఉన్నతి 17-21, 21-12, 21-11తో స్వబికోవాపై, ఇషారాణి 21-19, 21-19తో మిరండాపై, అన్మోల్‌ ఖర్బ్‌ 21-18, 22-20తో రనిత్మా లియనాగేపై గెలిచారు. అయితే ఆకర్షీ కశ్యప్‌ 12-21, 18-21తో పోలినా భురోవా చేతిలో ఓడింది.


ఇవి కూడా చదవండి..

మోలినో జిగేల్‌

మళ్లీ టాప్‌నకు అభిషేక్‌

కాజల్‌, నీలమ్‌కు రజతాలు

Updated Date - Oct 29 , 2026 | 01:33 AM