Share News

ఫొటోల కోసమే పిలిచారా?.. ఓ స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:39 PM

భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఓ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర వ్యక్తం చేశాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కపిల్ దేవ్.. కార్యక్రమం నిర్వహించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఫొటోల కోసమే పిలిచారా?.. ఓ స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్
Kapil Dev

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఓ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర వ్యక్తం చేశాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కపిల్ దేవ్.. కార్యక్రమం నిర్వహించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే రెండు రోజుల తర్వాత ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. కపిల్ దేవ్ వేదికపైకి వచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో సరైన వ్యవస్థ, క్రమశిక్షణ ఉండాలని సూచించారు.


‘స్కూల్‌లో అసలు వ్యవస్థ అనేదే లేదు. ఇలా ఎలా జరుగుతుంది? పాఠశాలలో సరైన సదుపాయాలు కూడా లేవు. నన్ను కేవలం ఫొటో కోసమే ఇక్కడికి పిలిచారా? ఆ విషయం ఏదో ముందే చెబితే దానికి ప్రత్యేకంగా సమయం కేటాయించేవాడిని. ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా లేదు. సదుపాయాలు సరిగ్గా లేవు. చెప్పిన టైమ్‌కి, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం జరగలేదు. నేను చాలా సేపు ఇక్కడ ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. నాతో ఫొటోల కోసమే ఇక్కడికి పిలిపించారన్నట్లు అందరూ ప్రవర్తిస్తున్నారు. దానివల్ల కార్యక్రమం ఆలస్యమైంది’ అంటూ కపిల్ దేవ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వాలని కూడా కపిల్‌ దేవ్‌ విద్యార్థులకు సూచించినట్లు వీడియోలో కనిపిస్తోంది. పాఠశాల కార్యక్రమాలు పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో నిర్వహించాలని అతడు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి:

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా

టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

Updated Date - Aug 17 , 2026 | 06:44 PM