ఫిఫా ప్రపంచ కప్‌లో 1000వ మ్యాచ్.. జపాన్ చారిత్రక విజయం
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:27 PM
ఫిఫా ప్రపంచ కప్‌లో జపాన్ మరోసారి తన దూకుడును కొనసాగించింది. గ్రూఫ్-ఎఫ్‌లో భాగంగా ట్యూనీషియాతో జరిగిన కీలక పోరులో జపాన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్‌కు మరింత చేరువైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో జపాన్ మరోసారి తన దూకుడును కొనసాగించింది. గ్రూఫ్-ఎఫ్‌లో భాగంగా ట్యూనీషియాతో జరిగిన కీలక పోరులో జపాన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్ జపాన్‌కు చారిత్రాత్మకంగా నిలిచింది. ఎందుకంటే ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు వారు సాధించిన అత్యధిక గోల్స్ ఇవే. నెదర్లాండ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న జపాన్.. ట్యూనీషియాతో మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. అయితే ఈ మ్యాచ్ ఫిఫాలో 1000వ కావడం విశేషం.
జపాన్ విజయంలో అయాసే ఉడా రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు దయిచీ కమాడా, జున్యా ఇతో చెరొక గోల్ చేశాడు. మరోవైపు ఆఫ్రికా జట్టు ట్యునీషియా మాత్రం మ్యాచ్ మొత్తం జపాన్ ధాటికి కుదేలైంది. ఈ పరాజయంతో ట్యునీషియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ఆరంభంలోనే జపాన్ ఆధిక్యం సాధించింది. 4వ నిమిషంలో కమాడా గోల్ చేసి ప్రపంచకప్ చరిత్రలో జపాన్‌కు అత్యంత వేగవంతమైన గోల్ నమోదు చేశాడు. కియోటో నకమురా ఇచ్చిన అద్భుత క్రాస్‌ను అతను సులభంగా గోల్‌గా మలిచాడు. 31వ నిమిషంలో అయాసే ఉడా అద్భుత వ్యక్తిగత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. బంతి అందుకున్న అతడు నేరుగా ట్యునీషియా బాక్స్ వైపు దూసుకెళ్లి, ఎడమ మూలలోకి వంకర షాట్‌తో బంతిని నెట్టాడు. 69వ నిమిషంలో జున్యా ఇతో గోల్ చేసి జపాన్‌కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఉడా చేసిన ఫ్లిక్ పాస్‌ను అందుకున్న ఇతో గోల్‌కీపర్‌తో ఒంటరిగా ఎదుర్కొని సులభంగా గోల్ చేశాడు. 83వ నిమిషంలో ఉడా తన రెండో గోల్‌తో మ్యాచ్‌కు ముగింపు పలికాడు.
ఈ విజయంతో జపాన్ నాలుగు పాయింట్లతో నెదర్లాండ్స్‌తో సమంగా నిలిచింది. అయితే గోల్స్ తేడా కారణంగా నెదర్లాండ్స్ టాప్‌లో ఉంది. తన తదుపరి మ్యాచ్‌లో జపాన్ స్వీడన్‌తో తలపడనుంది. మరోవైపు ట్యునీషియా నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుంది.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారు: కైఫ్
ఫైనల్: సునామీ ఇన్నింగ్స్.. లంక బౌలర్లను వేటాడిన వైభవ్!