ఇషాన్ శతకం
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:08 AM
దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను ఈస్ట్‌జోన్ అద్భుతంగా ఆరంభించింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో కెప్టెన్ ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్) అజేయ సెంచరీతో నిలిచాడు. ఇతర బ్యాటర్లు కూడా చెలరేగడంతో ఆదివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 385 పరుగులు సాధించింది.
ఈస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్ 385/4
చెన్నై: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను ఈస్ట్‌జోన్ అద్భుతంగా ఆరంభించింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో కెప్టెన్ ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్) అజేయ సెంచరీతో నిలిచాడు. ఇతర బ్యాటర్లు కూడా చెలరేగడంతో ఆదివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 385 పరుగులు సాధించింది. లెఫ్టామ్ పేసర్ సీవీ మిలింద్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌జోన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) వన్డే తరహాలో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి తొలి వికెట్‌కు 14.4 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యం దక్కింది. వైభవ్‌ను మిలింద్ అవుట్ చేయగా, వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85)తో కలిసి ఇషాన్ మరింత దూకుడు ప్రదర్శించాడు. సెంచరీ ఖాయమనుకున్న శిఖర్‌ను కూడా మిలింద్ అవుట్ చేయగా, నాలుగో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇషాన్-కుషాగ్ర (63 బ్యాటింగ్) జోడీ సౌత్ జోన్ బౌలర్లను మరింతగా విసిగించారు. ఐదో వికెట్‌కు ఈ ద్వయం మధ్య ఇప్పటికే అజేయంగా 144 పరుగులు జత చేరడం విశేషం.
సిరాజ్‌ను బాదేసిన వైభవ్
ఈసారి వైభవ్ సూర్యవంశీ బాదుడుకు పేసర్ సిరాజ్ బలయ్యాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో 3 డాట్ బాల్స్ ఆడిన వైభవ్ మరో మూడు బంతులను 4,6,4గా మలిచి 14 రన్స్ రాబట్టాడు.
వైభవ్‌పై తిలక్ స్లెడ్జింగ్
తొలి రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు వైభవ్, అభిమన్యు ధాటిగా ఆడుతుండడంతో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అసహనానికి గురయ్యాడు. ముఖ్యంగా వైభవ్ ఫీల్లర్ల మధ్య నుంచి షాట్లు ఆడేస్తూ బౌండరీలు సాధించాడు. దీంతో అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు తన నోటికి పనిచెప్పాడు. 11వ ఓవర్‌లో నేరుగా వైభవ్ దగ్గరికి వెళ్లిన తిలక్ ఏదో అనడం కనిపించింది. దీనికి వైభవ్ కూడా దీటుగా సమాధానమిస్తూ కనిపించాడు. ఆ తర్వాత కాసేపటికే వైభవ్ హాఫ్ సెంచరీకి ముందు అవుటయ్యాడు.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్