Share News

అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:36 PM

మండలంలోని సీలేరు-చింతపల్లి అంతర్‌ రాష్ట్ర రహదారి వర్షాలకు అత్యంత అధ్వానంగా తయారైంది. ఆర్‌వీనగర్‌ నుంచి నూతిబంద వరకు 14 కిలోమీటర్లు ప్రధాన రహదారిపై భారీ గోతులు, బురద ఏర్పడింది. దీంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.

అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి
గూడెంకాలనీ గోతుల వద్ద ఏర్పడిన బురద

వర్షాలకు భారీగా ఏర్పడిన గోతులు

ఆర్‌వీనర్‌ నుంచి నూతిబంద వరకు పూర్తిగా పాడైన రోడ్డు

అవస్థలు పడుతున్న వాహనచోదకులు

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి-సీలేరు ప్రధాన రహదారిలో భద్రాచలం, మల్కన్‌గిరి, ఛతీస్‌గఢ్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్‌వీనగర్‌ నుంచి నూతిబంద వరకు ఈ రహదారి పూర్తిగా పాడైపోయింది. రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి బురదగా మారిపోయింది. దీంతో ఈ మార్గంపై ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈరోడ్డుపై అవగాహన లేకుండా హైదరాబాద్‌, భద్రాచలం, ఒడిశా ప్రాంతాల నుంచి లంబసింగి, అరకు ప్రాంతాలకు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే పర్యాటకుల అవస్థలు వర్ణనాతీతం. ఈ మార్గంలో ప్రయాణించిన వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి మరమ్మతులపై ఆర్‌అండ్‌బీ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైన రహదారి నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌, కూటమి పాలకులు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 26 , 2025 | 10:36 PM