IND VS SA U-19: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. భారత్ టార్గెట్ 246
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:07 PM
సోమవారం బెనోనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా భారత్, సౌతాఫ్రికా అండర్-19 జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సోమవారం బెనోనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా భారత్, సౌతాఫ్రికా అండర్-19 జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. నాలుగో స్థానంలో వచ్చిన జాసన్ రోల్స్ (113 బంతుల్లో 114 పరుగుల) సెంచరీతో అదరగొట్టాడు. అయితే మిగతా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. డేనియల్ బోస్మాన్ 31, అద్నాన్ లగాడియన్ 25, అర్మాన్ మనక్ 16, బుల్బులియా 14, జోరిచ్ వాన్ షాల్క్విక్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 4, అంబరీష్ 2, దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. తొలి వన్డేలో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 25 పరుగుల తేడాతో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384