Share News

లక్ష్యం..క్వార్టర్స్‌ బెర్త్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 02:09 AM

డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌ రౌండ్‌-2లో భారత్‌, దక్షిణ కొరియా మధ్య రెండు రోజుల పోరు ప్రారంభం కానుంది. క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ కోసం భారత్‌ బలమైన సవాల్‌కు సిద్ధమైంది.

లక్ష్యం..క్వార్టర్స్‌ బెర్త్‌
India vs South Korea Davis Cup

  • కొరియాతో భారత్‌ ఢీ..

  • నేటినుంచే డేవిస్‌ కప్‌

సియోల్‌ (దక్షిణకొరియా): డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌ రౌండ్‌-2లో భాగంగా శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే పోరులో దక్షిణ కొరియాను భారత్‌ ఢీకొంటోంది. అయితే చారిత్రక క్వార్టర్‌ఫైనల్‌ స్థానమే లక్ష్యంగా భారత్‌ రెండు రోజుల ఈ పోరు బరిలో దిగుతోంది. ఈక్రమంలో మరోసారి దక్షిణేశ్వర్‌ సురేష్‌పై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. తొలిరోజు జరిగే మొదటి సింగిల్స్‌లో కొరియా నెం.1 ఆటగాడు సూన్‌వూ వోన్‌తో దక్షిణేశ్వర్‌ తలపడనున్నాడు.


భారత జట్టులో సురేష్‌ కూడా అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాడు కావడంతో తొలి మ్యాచ్‌ అత్యంత ఆసక్తి రేపుతోంది. గత ఫిబ్రవరిలో నెదర్లాండ్స్‌పై భారత్‌ 3-2తో నాటకీయంగా నెగ్గిన పోరులో 26 ఏళ్ల దక్షిణేశ్వర్‌ స్టార్‌గా నిలిచాడు. కాగా సింగిల్స్‌లో దక్షిణేశ్వర్‌తోపాటు సుమిత్‌ నగల్‌ తలపడతారు. అలాగే డబుల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ/నికీ పూనాచ రెండో రోజు బరిలోకి దిగనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఫేవరెట్‌ భారత్‌
అభిషేక్‌ విధ్వంసం

Updated Date - Sep 18 , 2026 | 02:09 AM