14 నుంచి 114 పతకాలకు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:39 AM
పారా ఆసియా క్రీడల్లో భారత అథెట్ల ప్రదర్శన ఊహించిన దానికంటే ఎంతో మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం 167 మంది సభ్యుల బృందంతో బరిలోకి దిగిన భారత్.. సెంచరీకిపైగా...
పారా ఆసియాడ్‌లో మెరుగైన భారత్ ప్రదర్శన
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
పారా ఆసియా క్రీడల్లో భారత అథెట్ల ప్రదర్శన ఊహించిన దానికంటే ఎంతో మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం 167 మంది సభ్యుల బృందంతో బరిలోకి దిగిన భారత్.. సెంచరీకిపైగా పతకాలతో నాలుగో స్థా నంలో నిలవడం విశేషం. పదహారేళ్ల పారా ఆసియాడ్ ప్రస్థానంలో ఇదే అ త్యుత్తమ ప్రదర్శన కావడం నిజంగా గర్వకారణం.
పతకాల సంఖ్య పెరుగుతూనే..: పారా క్రీడల్లో భారత ప్రదర్శన క్రమక్రమంగా మెరుగుపడుతూ సాగింది. 2010లో గ్వాంగ్జౌలో జరిగిన తొలి పారా క్రీడల్లో స్వర్ణం సహా 14 పతకాలతో 15వ స్థానంలో నిలిచిన భారత్.. 2014 గేమ్స్‌లో 3 స్వర్ణాలు సహా 33 మెడల్స్ కొల్లగొట్టినా 15వ స్థానానికే పరిమితమైంది. అయితే, 2018 జకార్తా క్రీడల్లో ఏకంగా 15 బంగారు పతకాలతో రాణించిన భారత్.. మొత్తం 72 మెడల్స్‌తో 9వ స్థానంలో నిలిచి ఎంతో పురోగతి కనబర్చింది. 2023 హాంగ్జౌ గేమ్స్‌లో 27 స్వర్ణాలతో మొత్తం 108 పతకాలు సాధించిన భారత్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఇక, 2026 అయిచి-నగోయలో గత ప్రదర్శనలను తలదన్నేలా 30 స్వర్ణ, 35 రజత, 49 కాంస్యాలతో మొత్తం 114 పతకాలతో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది.
సగం మందితోనే..: గత క్రీడల్లో 309 మందిని బరిలోకి దించితే.. ఈసారి దాదాపు సగం అంటే.. 167 మందికి కుదించారు. కానీ, ఫలితాలు మాత్రం అనూహ్యం. భారత్ ఎక్కువ పతకాలు సాధించడంలో అథ్లెటిక్స్ పాత్ర ఎంతో కీలకం. ఈ విభాగం నుంచే 22 పసిడి, 19 రజత, 24 కాంస్యాలు.. మొత్తంగా 65 పతకాలు లభించాయి. మహిళల 400 మీ. టీ20 ఈవెంట్లో రన్నర్ దీప్తి జీవాంజి స్వర్ణాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. తన గత రికార్డును తానే అధిగమించింది. పారా షట్లర్లు 3 స్వర్ణాలు సహా 16 పతకాలు అందించగా.. ఆర్చర్లు 3 బంగారు, 3 రజతాలు అందించారు. స్విమ్మింగ్ నుంచి 11 పతకాలు, షూటింగ్ నుంచి 5 పతకాలు దక్కాయి. ఒక అథ్లెట్ ఒకటి కంటే ఎక్కువ పతకాలు నెగ్గడం భారత్ బలంగా చెప్పుకోవాలి. ఆర్చర్ శీతల్ దేవినే తీసుకొంటే ఆమె రెండు స్వర్ణాలు, రజతం సాధించింది. అథ్లెటిక్స్‌లో దిలీప్ గవిత్, నిషాద్ కుమార్, ప్రణవ్, సిమ్రన్ శర్మ తలో రెండు స్వర్ణాలు నెగ్గారు. స్విమ్మింగ్‌లో రవి బుడిగిన రెండు రజత, కాంస్యంతో హ్యాట్రిక్ పతకాలు సాధించాడు. వీరందరి కృషి, పట్టుదలతో పారా క్రీడల్లో చెప్పుకోదగ్గ స్థాయికి చేరిన భారత్.. ఇక మీదట ఇదే జోరును కొనసాగించడాన్ని సవాల్‌గా తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News