Share News

మనమ్మాయిల జోరు

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:18 AM

ఆసియా కప్‌ జూనియర్‌ హాకీ మహిళల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 11-1తో మలేసియాను చిత్తు చేసింది.

మనమ్మాయిల జోరు

మోకి (చైనా): ఆసియా కప్‌ జూనియర్‌ హాకీ మహిళల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 11-1తో మలేసియాను చిత్తు చేసింది. శనివారం జరిగిన ఆరంభ పోరులో మనోళ్లు దక్షిణ కొరియాను 4-1తో ఓడించిన సంగతి తెలిసిందే. మలేసియాతో మ్యాచ్‌లో నాలుగు ఫీల్డ్‌ గోల్స్‌ చేసిన భారత్‌కు పెనాల్టీ కార్నర్ల ద్వారా ఐదు గోల్స్‌, మిగిలిన రెండు పెనాల్టీ స్ట్రోక్‌ ద్వారా లభించాయి. మంగళవారం జపాన్‌తో భారత్‌ తలపడనుంది.

జపాన్‌తో పురుషుల పోరు డ్రా

పురుషుల విభాగంలో పూల్‌ ‘ఎ’లో తలపడుతున్న భారత జట్టు జపాన్‌తో మ్యాచ్‌ను 3-3తో డ్రా చేసింది. కెప్టెన్‌ అన్‌మోల్‌ ఎక్కా రెండు, అషు మౌర్య ఒక గోల్‌ చేశారు. కజుకి (2), ససాకి (1) జపాన్‌కు గోల్స్‌ అందించారు. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 14-0తో ఇండోనేసియాపై ఘన విజయం సాధించిన విషయం విదితమే. మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌లో కొరియాను భారత్‌ ఢీకొననుంది.

ఈ వార్తలను కూడా చదవండి

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్‌

వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్

Updated Date - Sep 07 , 2026 | 01:18 AM