పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Oct 11 , 2024 | 11:26 PM
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే విష జ్వరాలు దరి చేరవని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట, అక్టోబరు 11 : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే విష జ్వరాలు దరి చేరవని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం మండలంలోని కానాయపల్లి గ్రామంలో డెంగీ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారంతో పాటు, డబ్బాలు, పాత కుండలు, పైపులు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే మురికినీరు ప్రవహిస్తున్న కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి సాయంత్రం వేళ ఫాగింగ్ చేయించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. డ్రైనేజీల నిర్మాణం చేయకపోవడంతో మురుగు ముందుకు పోవడం లేదని.. తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకోవాలని గ్రామ నాయకులు గోకరయ్య, సిద్ధయ్య కలెక్టర్‌ను కోరారు. అనంతరం కొత్తకోటలోని పీహెచ్‌సీని పరిశీలించి, వసతులపై డాక్టర్ ఆసియాబేగంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు గుంపుగట్టు సమీ పంలో ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చెన్నమ్మ, మునిసిపల్ చైర్‌పర్సన్ సుకేశిని ఉన్నారు.
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పాన్‌గల్/వీపనగండ్ల/ఆత్మకూరు/పెబ్బేరు రూరల్ : గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమ త్తంగా ఉండాలని పాన్‌గల్ మండల ప్రాథమిక వైద్యాధికారి చంద్రశేఖర్ అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంతో పాటు, కదిరేపాడు గ్రామంలో ఆయన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిల్వ నీటిని పరిశీలించి వాటిని పారబోశారు. కార్యక్రమంలో సూపర్‌వైజ ర్ శాంతమ్మ, హెల్త్ అసిస్టెంట్లు రాంచందర్, మదన్‌గోపాల్, జయలక్ష్మి, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా, వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా పీహెచ్‌సీ డాక్టర్ రాజశేఖర్ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఏఎన్‌ఎం సుజాత, అంగన్‌వాడీ టీచర్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఆ రవ వార్డులో పరిసరాల పరిశుభ్రతపై మునిసిపల్ చైర్‌పర్సన్ గాయత్రి కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కమిషనర్ నాగరాజు, వైస్ చైర్మన్ విజయ భాస్కర్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ సురేందర్‌గౌడ్, ముని సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆర్‌పీలు పాల్గొ న్నారు. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామంలో డీఆర్‌డీఏ పీడీ నాగేందర్ డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి ముందున్న నీటి సంపులు, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. డాక్టర్ వినీల, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.