భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్.. 23 ఓవర్లకు పాక్ స్కోరు 142/3..
ABN , Publish Date - Nov 22 , 2026 | 05:32 PM
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026లో భాగంగా పాకిస్థాన్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026లో భాగంగా పాకిస్థాన్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్-బిలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఎ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది (India vs Pakistan A 2026).
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ అబ్దుల్ సమద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మాజ్ సద్కత్ (59), హుస్సేన్ (33) తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే హుస్సేన్‌ను హర్షిత్ రాణా, సద్కత్ను సూర్యాంశ్ అవుట్ చేయడంతో పరిస్థితి మారింది. తర్వాత వచ్చిన నజీర్‌ను హర్షిత్ రాణా డకౌట్ చేశాడు. ప్రస్తుతం హసన్ నవాబ్ (36 బ్యాటింగ్), అబ్దుల్ సమద్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ఆయుష్ బదోనీ, సూర్యాంశ్ ఒక్కో వికెట్ పడగొట్టారు (India A vs Pakistan A Live Score).
ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు బరిలోకి దిగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది (Asia Cup Rising Stars 2026). ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు నేపాల్‌పై 306 పరుగులతో భారీ విజయం సాధించింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ భారత్ ఎ, పాకిస్థాన్ ఎ జట్లకు ఎంతో కీలకం. విజయం సాధించిన జట్టు గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. నవంబర్ 24న భారత్ ఎ జట్టు యూఏఈతో తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..