Share News

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో రాణించిన పాక్ బ్యాటర్లు.. భారత్-ఎ టార్గెట్ 314..

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:46 PM

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026లో భాగంగా భారత్‌-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ భారీ స్కోరు సాధించింది. 49.2 ఓవర్లలో 313కు ఆలౌటై భారత జట్టు ముందు 314 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో రాణించిన పాక్ బ్యాటర్లు.. భారత్-ఎ టార్గెట్ 314..
India A vs Pakistan A

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026లో భాగంగా భారత్‌-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ భారీ స్కోరు సాధించింది. 49.2 ఓవర్లలో 313కు ఆలౌటై భారత జట్టు ముందు 314 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్-బిలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఎ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హసన్ (79), సదాకత్ (59), ఫర్హాన్ (56) హాఫ్ సెంచరీలు సాధించారు. (India vs Pakistan A 2026).


ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ జట్టు కెప్టెన్ అబ్దుల్ సమద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మాజ్ సద్కత్ (59), హుస్సేన్ (33) తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. హుస్సేన్‌ను హర్షిత్ రాణా, సద్కత్‌ను సూర్యాంశ్ అవుట్ చేశారు. ఆ తర్వాత హసన్ నవాబ్, పర్హాన్ యూసఫ్ సమయోచితంగా ఆడి పాకిస్థాన్ భారీ స్కోరుకు బాటలు వేశారు. చివరకు పాకిస్థాన్-ఎ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. (India A vs Pakistan A Live Score).


ఈ మ్యాచ్‌లో భారత్-ఎ తరఫున తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు బరిలోకి దిగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది (Asia Cup Rising Stars 2026). ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ ఎ జట్టు 306 పరుగులతో భారీ విజయం సాధించింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ భారత్ ఎ, పాకిస్థాన్ ఎ జట్లకు ఎంతో కీలకం. విజయం సాధించిన జట్టు గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. నవంబర్ 24న భారత్ ఎ జట్టు యూఏఈతో తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.


ఇవి కూడా చదవండి..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..


రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..

Updated Date - Nov 22 , 2026 | 07:49 PM