నేటి నుంచే గ్లోబల్ చెస్ లీగ్
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:13 AM
వరుసగా గత మూడు సీజన్లు అలరించిన గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మళ్లీ వచ్చేసింది. ఈ నాలుగో సీజన్ లీగ్ శనివారం బెంగళూరు వేదికగా మొదలవనుంది.
బెంగళూరు: వరుసగా గత మూడు సీజన్లు అలరించిన గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మళ్లీ వచ్చేసింది. ఈ నాలుగో సీజన్ లీగ్ శనివారం బెంగళూరు వేదికగా మొదలవనుంది. మొత్తం ఆరుజట్లు.. గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్, పీబీజీ అలస్కన్ నైట్స్, ఫయర్స్ అమెరికన్ గాంబిట్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, చెక్ ముంబా మాస్టర్స్, ఆల్పైన్ ఏపీఎల్ పైపర్స్ ఈ లీగ్‌లో పోటీపడుతున్నాయి. ఫైనల్ ఈనెల 13న జరగనుంది. తొలి రెండు సీజన్లకు దుబాయ్, లండన్ ఆతిథ్యమివ్వగా.. గతేడాది లీగ్ ముంబైలో జరిగింది. ఇక, నిరుటి లీగ్‌కు దూరమైన ప్రపంచ నెంబర్‌వన్ కార్ల్‌సన్ ఈ సీజన్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. మహిళల ప్రపంచకప్ విజేత దివ్యా దేశ్‌ముఖ్ తొలిసారి ఈ లీగ్‌లో ఆడుతోంది. వరుసగా మూడేళ్లు గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టుకు ఆడిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. ఈసారి అలస్కన్ నైట్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఇలా, సరికొత్త అంశాలతో ఈసారి లీగ్ అభిమానులను మరింత అలరించనుంది. కార్ల్‌సన్, దివ్యతో పాటు కోనేరు హంపి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌ను చాలెంజ్ చేయనున్న సిందరోవ్‌లాంటి స్టార్లు జీసీఎల్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్
వైసీపీ కీలక నేత అరెస్ట్.. పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన ఆ పార్టీ శ్రేణులు