పాక్ కెప్టెన్ సనాకు జరిమానా
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:38 AM
పాక్ కెప్టెన్ సనాకు జరిమానా Fine Issued For Pakistan Womens Captian Fathima Sana
దుబాయ్: భారత్‌తో మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు జరిమానా పడింది. గత శనివారం టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మను తన బౌలింగ్‌లో సనా క్యాచవుట్ చేసింది. ఈక్రమంలో పెవిలియన్‌కు వెళ్లిపోవాలంటూ షఫాలీకి ఫాతిమా చేతితో దారి చూపింది. ఇది ఐసీసీ నిబంధనావళిని అతిక్రమించడమంటూ పాక్ కెప్టెన్‌కు మ్యాచ్ రుసుములో 10 శాతం కోత విధించారు. అంతేకాదు ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమచేశారు. 24 నెలల సమయంలో ఫాతిమా ఇలా రెండోసారి నిబంధనలను ఉల్లంఘించడంతో ఆమె ఖాతాలో మరో డీ మెరిట్ పాయింట్ చేరింది.
ఈ వార్తలనూ చదవండి
బిట్టు ఓ హీరో.. అతడికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి: కెవిన్ పీటర్సన్
వైభవ్ సూర్యవంశీని టీజ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్