పీఎస్ఎల్‌లో బాల్ టాంపరింగ్.. రిటైర్‌మెంట్‌పై పాక్ ప్లేయర్ ఫఖర్ జమాన్ యూటర్న్
ABN , Publish Date - Apr 07 , 2026 | 09:25 PM
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాల్ టాంపరింగ్ వివాదంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు.. టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేల్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాల్ టాంపరింగ్ వివాదంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు.. టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేల్చింది. దీంతో అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ ఘటన క్రీడావర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పీఎస్ఎల్‌లో భాగంగా ఫఖర్ ప్రస్తుతం లాహోర్ క్వాలెండర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. కరాచీ కింగ్స్‌తో జరిగిన పోరులో అంపైర్లు బంతిని పరిశీలించి, దానిలో మార్పులు ఉన్నట్లు గుర్తించి పెనాల్టీ రన్స్ విధించారు. ఈ ఘటన తర్వాత ఫఖర్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టిన మ్యాచ్ అధికారులు, చివరికి అతడిపై చర్యలు తీసుకున్నారు. తనకు విధించిన రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ చేసిన అప్పీల్‌ను కూడా టెక్నికల్ కమిటీ తిరస్కరించింది. దీంతో అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఇదిలా ఉండగా, తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌పై వచ్చిన ఊహాగానాలపై కూడా ఫఖర్ స్పందించాడు. ‘టీ20 వరల్డ్ కప్ 2028 తర్వాత రిటైర్ కావాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నాను. గొప్ప స్థాయిలోనే నా కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నాను’ అని వెల్లడించాడు. 35 ఏళ్ల ఫఖర్ ఈ నిర్ణయంతో అభిమానులకు ఊరటనిచ్చినా ఈ బాల్ టాంపరింగ్ వివాదం మాత్రం అతని ప్రతిష్ఠపై మచ్చ వేసింది.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్