Share News

పీటర్సన్‌ ఇక మార్గదర్శకుడిగా..

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:01 AM

మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ తెల్ల బంతుల జట్లకు ప్రత్యేక మార్గదర్శకుడిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సోమవారం ప్రకటించింది.

పీటర్సన్‌ ఇక మార్గదర్శకుడిగా..

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్లకు నియామకం

లండన్‌: మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ తెల్ల బంతుల జట్లకు ప్రత్యేక మార్గదర్శకుడిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు ఇంగ్లండ్‌ను సిద్ధం చేసే క్రమంలో పీటర్సన్‌కు బాధ్యతలు అప్పగించినట్టు బోర్డు తెలిపింది. ఈ నెలలో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల నుంచి కెవిన్‌ కొత్త బాధ్యతలు చేపడతాడు.

ఈ వార్తలనూ చదవండి

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

గాంబిట్స్‌కు గ్యాంజస్‌ ఝలక్‌

Updated Date - Sep 08 , 2026 | 02:01 AM