సబలెంక దూకుడు
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:22 AM
వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకొనే దిశగా టాప్ సీడ్ అర్యాన సబలెంక మరో అడుగు వేసింది. ఈ వరల్డ్ నెం.1 బెలారస్ భామ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సబలెంక 6-4, 6-3తో టౌన్‌సెండ్‌ను వరుస సెట్లలో ఓడించింది.
క్వార్టర్స్‌కు డిఫెండింగ్ చాంప్ యూఎస్ ఓపెన్
న్యూయార్క్: వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకొనే దిశగా టాప్ సీడ్ అర్యాన సబలెంక మరో అడుగు వేసింది. ఈ వరల్డ్ నెం.1 బెలారస్ భామ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సబలెంక 6-4, 6-3తో టౌన్‌సెండ్‌ను వరుస సెట్లలో ఓడించింది. ఇక.. మూడో రౌండ్ మ్యాచ్‌లలో రెండో సీడ్ ఎలెనా రిబకినా 7-6 (6), 6-3తో స్తరోదబ్‌త్సేవాపై, నాలుగో సీడ్ కొకొ గాఫ్ 6-3, 6-4తో బుక్సాపై, ఐదో సీడ్ మిర్రా ఆండ్రీవా 6-2, 7-6 (5)తో బర్తున్కోవాపై, ఎనిమిదో సీడ్ స్వియటెక్ 7-6 (3), 7-6 (3)తో 25వ సీడ్ బౌజ్కోవాపై, 13వ సీడ్ ఒసాక 6-3, 3-6, 7-5తో 23వ సీడ్ మెర్టెన్స్‌పై, 14వ సీడ్ జోవిక్ 7-5, 6-3, 7-5తో 17వ సీడ్ ఈలాపై గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-2, 7-6 (2), 6-2తో 25వ సీడ్ తబీలోపై, 14వ సీడ్ టీన్ 6-3, 1-6, 6-7 (7), 6-3, 6-4తో 17వ సీడ్ మెన్సిక్‌పై గెలుపొంది ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
5, 9వ సీడ్లు అవుట్: పురుషుల సింగిల్స్ టాప్ టెన్ ఆటగాళ్లలో ఇద్దరికి చుక్కెదురైంది. ఐదో సీడ్ కొబోలి, తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ మూడో రౌండ్‌లో ఇంటిబాట పట్టారు. 29వ సీడ్ అలెగ్జాండర్ బ్లాక్ 6-4 (7), 6-3, 6-0, 6-3తో ఐదో సీడ్ కొబోలికి, 24వ సీడ్ సెరుండోలో 3-6, 4-6, 6-3, 6-4, 6-4తో ఫ్రిట్జ్‌కి షాకిచ్చారు.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్