టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్
ABN , Publish Date - Jun 19 , 2026 | 07:42 AM
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ వుమెన్ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. గ్రూప్-బిలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం స్కాట్లాండ్ 146 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటికే న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన వెస్టిండీస్.. ఈ గెలుపుతో సెమీస్ కు మరింత చేరువైంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన స్కాట్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ దిగింది. స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో విండీస్ జట్టు పరుగులను రాబట్టేందుకు కాస్త ఇబ్బంది పడింది. ఈ కరేబియన్ జట్టు 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.షెమైన్ క్యాంప్‌బెల్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసి.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. అలానే ఏడో స్థానంలో బరిలోకి దిగిన స్టెఫానీ టేలర్ 19 బంతుల్లో అజేయమైన 47 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోర్‌ను అందించింది. మిగతా ప్లేయర్లలో కియానా జోసెఫ్ (13), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (14), డియాండ్రా డాట్టిన్ (14), క్లాక్స్టన్ (16), చినెల్ హెన్రీ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. స్కాట్లాండ్ బౌలర్లలో కెథరిన్ ఫ్రేజర్ 2 వికెట్లు సాధించింది.. కెథరిన్ బ్రైస్, రేచల్ స్లేటర్, గార్డన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 154 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ శుభారంభం చేసింది. డార్సీ కార్టర్, కెథరిన్ ఫ్రేజర్ జోడీ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. మ్యాచ్ మధ్యలో గాయం కావడంతో కార్టర్ కాస్త ఇబ్బంది పడింది. అలా గాయంతో బాధపడుతూనే కార్టర్ 53 బంతుల్లో అర్ధశతకం సాధించింది. ఇక గెలుపు దిశగా స్కాట్లాండ్ సాగుతున్న సమయంలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. వరుస బంతుల్లో కీలక వికెట్లు తీసి స్కాట్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. మాథ్యూస్3, అఫీ ఫ్లెచర్ 2 వికెట్లు తీయడంతో 23 పరుగుల వ్యవధిలో స్కాట్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో గట్టిగా పోరాడినా 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా 7 పరుగుల స్వల్ప తేడాతో వెండీస్ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
నాడు యాసిడ్ దాడి బాధితుడు నేడు ‘కాంగో’ హీరో