కేన్ కేక
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:35 AM
ఎర్లింగ్టన్ (యూఎస్): కెప్టెన్ హ్యారీ కేన్ డబుల్ ధమాకాతో.. ఇంగ్లండ్ ఘనంగా బోణీ చేసింది. గ్రూప్-ఎల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-2తో క్రొయేషియాపై గెలిచింది. 12వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచిన కేన్...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
మెక్సికో X ద.కొరియా
(ఉదయం 6.30)
అమెరికా X ఆస్ట్రేలియా
(అర్ధరాత్రి 12.30)
స్కాట్లాండ్ X మొరాకో
(శనివారం తెల్లవారుజామున 3.30)
డబుల్ గోల్స్‌తో విజృంభణ జూ క్రొయేషియాపై ఇంగ్లండ్ గెలుపు
ఎర్లింగ్టన్ (యూఎస్): కెప్టెన్ హ్యారీ కేన్ డబుల్ ధమాకాతో.. ఇంగ్లండ్ ఘనంగా బోణీ చేసింది. గ్రూప్-ఎల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-2తో క్రొయేషియాపై గెలిచింది. 12వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచిన కేన్.. 42వ నిమిషంలో హెడర్‌తో మరోగోల్ సాధించాడు. జూడ్ బెలింగం (47వ), మార్కస్ రాష్‌ఫోర్డ్ (85వ) మరో రెండు గోల్స్ అందించారు. క్రొయేషియా తరఫు మార్టిన్ బటురినా (36వ), మూసా (45+5వ) గోల్స్ సాధించారు. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఘనా 1-0తో పనామాపై గెలిచింది. సెకండాఫ్ స్టాపేజ్ టైమ్‌లో కాలేబ్ ఇరెంకీ (90+5వ నిమిషం) ఏకైక గోల్ అందించాడు.
ఉజ్బెక్‌పై కొలంబియా విజయం
మెక్సికో సిటీ: తొలిసారి వరల్డ్‌క్‌పలో ఆడుతున్న లూయిస్ డియాజ్ గోల్‌తోపాటు మరో గోల్‌కు సహకారం అందించాడు. దీంతో గ్రూప్-కెలో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 3-1తో ఉజ్బెకిస్థాన్‌పై నెగ్గింది. డానియల్ ముంజో (40వ), డియాజ్ (65వ), జెమ్టిన్ కాంపేజ్ (90+9వ) కొలంబియా తరఫున గోల్స్ చేశారు. 60వ నిమిషంలో ఉజ్బెక్ ప్లేయర్ అబో్‌సబెక్ ఫేజుల్లేవ్ గోల్ సాధించాడు. 40వ నిమిషంలో డియాజ్ ఇచ్చిన పాస్‌ను అందుకొన్న డానియల్ ముంజో గోల్ చేశాడు. కానీ, సెకండా్‌ఫలో ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ అబో్‌సబెక్ గోల్ చేసి 1-1తో సమం చేశారు. ఆ తర్వాత 65వ నిమిషంలో ప్రత్యర్థి గోల్‌కీపర్‌కు తగిలి వెనక్కివచ్చిన బంతిని డియాజ్ నేరుగా గోల్‌లోకి పంపాడు. ఇక, స్టాపేజ్ టైమ్‌లో హెడర్‌తో కాంపేజ్ కొలంబియాకు మూడో గోల్ అందించాడు.
ఫ్యాన్స్‌కు జాక్‌పాట్
కతార్ ఫ్యాన్స్‌కు ఆ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వాంకోవర్‌లో కెనడాతో జరిగే మ్యాచ్ కోసం ఎంపిక చేసిన 1000 మంది కతార్ అభిమానులను.. ప్రత్యేక విమానాల్లో పంపనుంది. వీరికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.
కొరియా శిబిరం వద్ద డ్రోన్ కలకలం..
దక్షిణ కొరియా జట్టు క్యాంప్‌పై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. కొరియా టీమ్ మెక్సికోలోని గౌదలహార బేస్ క్యాంప్‌గా చేసుకొంది. అయితే, శిబిరం వద్దకు అనధికారికంగా డ్రోన్ రావడంతో భద్రతా సిబ్బంది కూల్చి వేశారు. దీన్ని ఎవరు ఎగుర వేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన కేన్.. ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా 10 గోల్స్ చేసిన గ్యారీ లినెకర్ రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా బెక్‌హామ్ తర్వాత మూడు ప్రపంచక్‌పల్లోనూ గోల్ చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు.
ఇవీ చదవండి:
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ