ఆసియా క్రీడల క్రికెట్ కోచ్‌గా లక్ష్మణ్
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:34 AM
ఆసియా క్రీడల్లో తలపడే భారత టీ20 క్రికెట్ జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈమేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో తలపడే భారత టీ20 క్రికెట్ జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈమేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. జపాన్‌లో ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు ఈ గేమ్స్ జరుగనున్నాయి. పురుషుల పోటీలు 24 నుంచి అక్టోబరు 3 వరకు, మహిళల పోటీలు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. 10 జట్లు బరిలోకి దిగనుండగా.. శ్రేయాస్ నేతృత్వంలోని భారత్ నేరుగా క్వార్టర్స్‌లో తలపడుతుంది. ఇక మహిళల్లో తలపడే 8 జట్లూ నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌నుంచే ఆడతాయి. కాగా లక్ష్మణ్ ఆసియాగేమ్స్‌లో జట్టు కోచ్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. 2023లో చైనాలో జరిగిన క్రీడల్లోనూ తనే జట్టు శిక్షకుడిగా ఉండగా, భారత్ స్వర్ణం గెలిచింది. అటు మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ఆధ్వర్యంలోనే బరిలోకి దిగనుంది.
అందుకే లక్ష్మణ్ ఎంపిక..
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కాకుండా లక్ష్మణ్‌ను ఎంపిక చేయడం వెనుక ఓ కారణం ఉంది. ఎందుకంటే ఆసియా గేమ్స్ జరిగే సమయంలోనే భారత జట్టు స్వదేశంలో వెస్టిండీ్‌సతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది.
బుమ్రా గాయం గురించి తెలీదు..
గాయం కారణంగా పేసర్ బుమ్రా గత నెలలో జరిగిన శ్రీలంక టెస్టు సిరీస్‌లో ఆడలేదు. అయితే అతడి గాయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా అవగాహన లేదట. ఆ టూర్ కోసం జట్టును ఎంపిక చేయడానికి కొన్ని రోజుల ముందు వరకూ బుమ్రా ఫిట్‌గా లేడనే విషయం తెలీదని, దీనికి సంబంధించి అగార్కర్‌కు ఈమెయిల్ పంపారని ఓ మీడియాలో కథనం వెలువడింది.
ఇవి కూడా చదవండి:
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి
వృద్ధురాలిని ఎత్తుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి