వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:57 PM
త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి వైభవ్ సూర్యవంశీని తూర్పు జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మైదానంలో పరుగుల వరద పారిస్తుంటాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోర్ చేసి.. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్ దాటేసి.. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలానే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో అంతగా రాణించలేకపోయినా.. జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచుల టీ20 సిరీస్‌లో చక్కగా రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీలో తూర్పు జోన్ జట్టుకు వైభవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైభవ్‌కు వెస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదంటూ మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి వైభవ్ సూర్యవంశీని తూర్పు జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఉండాల్సింది అని, ముందుగా సూర్యవంశీ రెడ్-బాల్ క్రికెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడమే అతి ముఖ్యమని అతడు పేర్కొన్నాడు.
బీహార్ తరఫున ఈ 15 ఏళ్ల సంచలనం ఇప్పటివరకు కేవలం 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడని గుర్తు చేశాడు. 'జోనల్ సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీని ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది అని నేను అభిప్రాయపడుతున్నాను. అది వైభవ్‌పై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది. అతనికి అలాంటి బాధ్యతలు అప్పగించే ముందు, రెడ్ బాల్ క్రికెట్ డైనమిక్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోనివ్వాలి' అని పంచల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
హాకీ ప్రపంచ కప్: 28 ఏళ్ల తర్వాత.. టోర్నీలో భారత అంపైర్‌కు నో ఛాన్స్
అరంగేట్రం తర్వాత రెండేళ్లు అవకాశం కోసం ఎదురుచూశా: అజింక్య రహానె