Share News

వైభవ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. తొలి ప్లేయర్‌గా

ABN , Publish Date - May 29 , 2026 | 09:09 PM

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే...

వైభవ్ ఖాతాలో మరో  అరుదైన రికార్డు.. తొలి ప్లేయర్‌గా
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో రాజస్థాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్‌లో ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో 500 పైచిలుకు పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.


ఇప్పటివరకు, పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2016 సీజన్‌లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు. అలానే వైభవ్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. ఐపీల్ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ యువ సంచనలం కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు.


పవర్‌ప్లేలో అత్యధిక చేసిన టాప్ ప్లేయర్లు:

  • వైభవ్ సూర్యవంశీ(2026)- 500+

  • డేవిడ్ వార్నర్(2016)- 467

  • ట్రావిస్ హెడ్ (2024) - 402

  • సాయి సుదర్శన్(2025)- 402

  • ఆడమ్ గిల్‌క్రిస్ట్(2009)-382


మ్యాచ్ విషయానికి వస్తే,.. రాజస్థాన్ జట్టు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ రూపంలో రెండు ఆరంభ వికెట్లను కోల్పోయింది. అయినప్పటికీ, సూర్యవంశీ తన పద్ధతిని మార్చుకోకుండా దూకుడుగా ఆట కొనసాగించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేసి.. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 172 పరుగుల వద్ద 18వ ఓవర్ రెండో బంతికి రబాడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ చిచ్చర పిడుగు ఎలిమినేటర్ మ్యాచ్‌లో కూడా 29 బంతుల్లో 97 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 29 , 2026 | 09:53 PM