Share News

ఇక ఆ విషయాలు మాట్లాడను: ఖవాజా

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:38 AM

తన జీవిత కథ ‘సబర్‌’లో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా..దక్షిణాఫ్రికాతో టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి...

ఇక ఆ విషయాలు మాట్లాడను: ఖవాజా

మెల్‌బోర్న్‌: తన జీవిత కథ ‘సబర్‌’లో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా..దక్షిణాఫ్రికాతో టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్‌ ఆస్ట్రేలియాలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఖవాజా మేల్కొన్నాడు. తన జీవిత కథ పుస్తక ప్రచారానికి సంబంధించిన ఇంటర్వ్యూలను నిలిపి వేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ‘ఈ వ్యవహారంపై ఇప్పటికే సోషల్‌మీడియాలో చెప్పేశా. అలాగే నా పుస్తకంలో కూడా రాశా. ఇకపై ఆ వివాదాస్పద విషయాల్ని మాట్లాడను’ అని ఖవాజా స్పష్టం చేశాడు. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన ఆ టెస్ట్‌ ‘శాండ్‌ పేపర్‌’ వివాదంలో బాధ్యులుగా చేస్తూ నాటి కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంతి ఆకారం మార్పునకు సంబంధించిన విషయం నాటి ఆస్ట్రేలియా జట్టులోని అందరికీ తెలుసునని ఖవాజా వెల్లడించడం సంచలనం సృష్టించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:38 AM