టీ20 డబ్ల్యూసీ 2026: మాట నిలబెట్టుకున్న సునీల్ గావస్కర్..
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:35 PM
టీ20 ప్రపంచ కప్2026 ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో చిందేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. తుదిపోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సూర్య కుమార్ సేన.. టైటిల్‌ను ముద్దాడింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్..తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇంతకు ఆయన ఇచ్చిన మాట ఏంటి?. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్‌కు గావస్కర్ ఓ వాగ్దానం చేశారు. 2024లో గెలిచిన టైటిల్‌ను భారత జట్టు కాపాడుకుంటే.. తాను డ్యాన్స్ చేస్తానని సూర్యకు గావస్కర్ మాట ఇచ్చారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) గవాస్కర్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తుదిపోరులో టీమిండియా గెలిచిన అనంతరం ఈ లెజెండరీ ప్లేయర్ ఆనందంతో చిందులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలానే మ్యాచ్‌కు ముందు జరిగిన ముగింపు వేడుకలోనూ ఓ బాలీవుడ్ సాంగ్‌కు సునీల్ గావస్కర్ స్టెప్పులేశాడు. ఇలా అయన మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
ఇప్పటి వరకు వారు లేకుండా ప్రపంచకప్ గెలవని భారత్..!
వారి నిర్ణయాలు అద్భుతం.. టీమిండియాపై పాక్ దిగ్గజం ప్రశంసలు