Share News

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Apr 02 , 2026 | 07:04 PM

ఐపీఎల్ 2026లో భాగంగా మరో పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే..
kkr vs srh

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా మరో పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బౌలింగ్ ఎంచుకుంది.


దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌ కోసం కేకేఆర్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సన్‌ రైజర్స్‌ ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ కొత్తగా జట్టులోకి వచ్చాడు.  ఈ సీజన్ లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ముంబై చేతిలో కేకేఆర్, ఆర్సీబీ చేతిలో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి.. బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.


తుది జట్లు:

సన్‌ రైజర్స్ హైదరాబాద్:

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్

ఇంపాక్ట్ సబ్‌లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్

కోల్‌కతా నైట్ రైడర్స్:

అజింక్యా రహానె(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ

ఇంపాక్ట్ సబ్‌లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్‌మన్ పావెల్


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్

Updated Date - Apr 02 , 2026 | 07:26 PM