ఇక మంధాన శకం
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:04 AM
భారత మహిళల క్రికెట్లో ఇక స్మృతి మంధాన శకం ఆరంభం కానుంది. ఇటీవలే మూడు ఫార్మాట్లకూ పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితురాలైన ఈ స్టార్ ఓపెనర్...
నేటి నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్
రాత్రి 7 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి బరిలోకి..
రాయ్‌పూర్: భారత మహిళల క్రికెట్లో ఇక స్మృతి మంధాన శకం ఆరంభం కానుంది. ఇటీవలే మూడు ఫార్మాట్లకూ పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితురాలైన ఈ స్టార్ ఓపెనర్ సారథ్యంలోని భారత జట్టు తొలి సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం ఆరంభం కానుంది. ద్వైపాక్షిక సిరీస్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే మొదటిసారి. మరోవైపు భార త జట్టు ఇటీవల ఆసియాకప్ టైటిల్‌తో పాటు, ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం అందుకుని జోష్‌లో ఉంది. ఇలా ఆసియా స్థాయిలో తమ ఆధిపత్యానికి ఢోకా లేకపోయినా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంటోంది. టీ20 వరల్డ్‌కప్‌ల్లో వరుసగా రెండుసార్లు గ్రూ ప్ దశ నుంచే వెనుదిరిగింది. బలహీనజట్లపై గెలవడం కాకుండా పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిందే. అందు కే కొత్త కెప్టెన్ మంధాన ఆధ్వర్యంలో భారత్ సరికొత్త ఆటతీరుతో తమదైన ముద్ర వేయాలనుకుంటోంది. ఇక జోస్ఫిన్ ఎన్కోమో సారథ్యంలోని జింబాబ్వే గత నెలలో వెస్టిండీ్‌సపై సిరీస్ కోల్పోయినా, ఓ వన్డేలో మాత్రం గెలిచింది.
మిడిలార్డర్ పుంజుకోవాలి..
వైస్‌కెప్టెన్ షఫాలీ తన చివరి ఐదు టీ20ల్లో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేసింది. ఓపెనర్లు మంధాన, షఫాలీ జోడీ అందించే తుఫాన్ ఆరంభాలను మిడిలార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోతోంది. అలాగే జెమీమా గైర్హాజరీలో వన్‌డౌన్ స్థానం కుర్చీలాటలా మారింది. ఆసియాగేమ్స్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భార్తి, కమలిని, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను బరిలోకి దించాల్సి వచ్చింది. ఇక లోయరార్డర్లో రిచా ఘోష్‌కు అండగా నిలిచే పవర్ హిట్టర్లు కరువయ్యారు. అలాగే ఫీల్డింగ్‌తో పాటు పేస్ బౌలింగ్ కూడా ఆశించిన రీతిలో లేదు. అయితే ఇటీవలి మ్యాచ్‌ల్లో నందని శర్మ ఆశాకిరణంలా కనిపిస్తోంది. దీప్తి శర్మ, శ్రీచరణిలతో కూడిన స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. ఇక టెస్టు క్రికెట్ ఆడే దేశాల నుంచి ఒకే క్యాలెండర్ ఏడాదిలో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు శ్రీచరణి మరో ముగ్గురిని అవుట్ చేస్తే చాలు. ఏదేమైనా మంధాన బృందం తమ లోపాలను సరిచేసుకుని జింబాబ్వేపై పూర్తిస్థాయిలో రాణించాల్సిన అవసరముంది.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ