Share News

టీ20 ప్రపంచకప్ 2026: ఇంగ్లండ్ టార్గెట్ 153

ABN , Publish Date - Feb 14 , 2026 | 05:17 PM

టీ20 ప్రపంచ కప్‌-2026లో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌కు153 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

టీ20 ప్రపంచకప్ 2026: ఇంగ్లండ్ టార్గెట్ 153
England vs Scotland

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌(World Cup 2026)లో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌కు153 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ కు దిగిన స్కాట్లాండ్‌ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిచీ బెరింగ్‌టన్ (32 బంతుల్లో 49) తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలానే మైకెల్ జోన్స్ (20 బంతుల్లో 33 పరుగులు), టామ్‌ బ్రూస్ (18 బంతుల్లో 24 పరుగులు) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. అలానే జోఫ్రా ఆర్చర్, లియామ్‌ డాసన్ చెరో రెండు వికెట్లు సాధించగా... జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 14 , 2026 | 05:48 PM