రోహిత్ స్థానంపై డౌటే లేదు..
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:49 AM
టీమిండియా వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఫుల్‌స్టాప్ పెట్టాడు. జట్టులో అతడి స్థానంపై సందేహాలు వద్దన్నాడు. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
ముంబై: టీమిండియా వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఫుల్‌స్టాప్ పెట్టాడు. జట్టులో అతడి స్థానంపై సందేహాలు వద్దన్నాడు. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ‘అన్ని మ్యాచ్‌ల్లోనూ శర్మ ప్రదర్శన బాగుంది. మరి జట్టులో స్థానంపై డౌటెందుకు? వదంతులు వ్యాప్తిచేసే వారికి మరో అవకాశం ఇవ్వదల్చుకోలేద’ని గురువారం బోర్డు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో సైకియా చెప్పాడు. ఛీప్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని పొడిగించే విషయమై కూడా ఎటువంటి చర్చ జరగలేదన్నాడు.
ఇవి కూడా చదవండి:
కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్