పాక్ జట్టులో భారత ప్లేయర్ల పేర్లు.. వీడియో వైరల్!
ABN , Publish Date - May 09 , 2026 | 04:54 PM
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్‌కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు నెట్టింట వైరల్‌గా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. తాజాగా పాక్ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ల పేర్లు దర్శనమించాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఈ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. మరి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...
పాక్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ మే 8న షేర్-ఏ బంగ్లా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట సందర్భంగా బ్రాడ్‌కాస్టర్ పాక్ జట్టు టెస్ట్ గణాంకాలను ప్రదర్శించే గ్రాఫిక్‌ను చూపించింది. అయితే అందులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, అర్షదీప్ సింగ్ తదితర భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి. తెరపై కనిపించిన గ్రాఫిక్‌లో రోహిత్ శర్మను పాకిస్థాన్ కెప్టెన్‌గా చూపించారు.. బ్రాడ్‌కాస్టర్ చేసిన ఈ భారీ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీమ్స్, సరదా కామెంట్లతో బ్రాడ్‌కాస్టర్‌ను ట్రోల్ చేశారు. కొందరు ఐపీఎల్ మోడ్‌లోనే గ్రాఫిక్స్ తయారు చేశారా..? అంటూ ప్రశ్నలు సంధించారు. మరోవైపు పాక్ అభిమానులు మాత్రం ఇది సాధారణ తప్పిదం కాదని, నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొమినుల్ హక్ 91, ముష్ఫికర్ రహీం 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్ల సాధించాడు. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. పాకిస్థాన్ 41 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో అజాన్(78*), ఫజల్(27*) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని
ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి