గెలిచిన ఆనందంలో లఖ్‌నవూకు బిగ్ షాక్.. పంత్‌కు భారీ జరిమానా
ABN , Publish Date - May 16 , 2026 | 12:13 PM
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ అద్భుత విజయాన్ని సాధించింది. సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లఖ్ నవూ విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న లఖ్‌నవూ జట్టుకు భారీ షాక్ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ అద్భుత విజయాన్ని సాధించింది. సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లఖ్ నవూ విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న లఖ్‌నవూ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant)ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. చెన్నైతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిషబ్ పంత్ కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
ఐపీఎల్ ప్రవర్తన నియమావలిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు రిషబ్ పంత్‌ను దోషిగా తేలింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ సీజన్లో ఇది తొలి తప్పిదం కావడంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కేవలం కెప్టెన్‌కు మాత్రమే రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఒకవేళ ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే .. అప్పడు కెప్లెన్ పంత్‌కు 24లక్షలతో పాటు జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు.. రెండింటిలో ఏదీ తక్కువ అయితే అది జరిమానాగా విధిస్తారని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
‘ఐపీఎల్ 2026లో భాగంగా 54వ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. అందుకుగాను జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి ఉల్లంఘన ఇది కావడంతో, రిషబ్ పంత్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సీజన్ ముగియడానికి మరో 15 రోజులు మాత్రమే ఉండటంతో మ్యాచ్‌ల తీవ్రత దృష్ట్యా బౌలింగ్ సమయాన్ని నియంత్రించడం కెప్టెన్లకు పెద్ద సవాలుగా మారింది.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ చేతిలో ఓటమి తర్వాత సహచరులకు రుతురాజ్ బిగ్ మెసేజ్
కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి