Share News

రాబర్ట్ వాద్రాకు ఊరట.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు బెయిల్

ABN , Publish Date - May 16 , 2026 | 11:29 AM

షికోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..

రాబర్ట్ వాద్రాకు ఊరట.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు బెయిల్
Robert Vadra Bail

న్యూఢిల్లీ: షికోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఆయనకు ఒక ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ దేశ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తీరుపై వాద్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ‘ఈడీ స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వమే వెనుక ఉండి నడిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే అది ముందుకు సాగుతోంది. ఈడీ వైపు నుంచి జరుగుతున్నది ఎంతమాత్రం న్యాయం కాదు. కేసు దర్యాప్తునకు నేను ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటా. నేను ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. నా వద్ద దాచడానికి ఏమీ లేదు. దర్యాప్తు సంస్థలు అడిగే అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. ఎలాంటి పరిస్థితులనైనా, చట్టపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి సామర్థ్యం నాకు ఉంది’.. అని రాబర్ట్ వాద్రా అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

2025లోనూ నీట్‌ లీక్‌?

బెంగాల్‌లో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌

Updated Date - May 16 , 2026 | 11:36 AM