బెంగాల్‌లో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్
ABN , Publish Date - May 16 , 2026 | 04:10 AM
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టరుపై జరిగిన అత్యాచారం, హత్య కేసును సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న కారణంతో ముగ్గురు ఐపీఎస్..
ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసు దర్యాప్తులో లోపాలపై చర్యలు
కోల్‌కతా, మే 15: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టరుపై జరిగిన అత్యాచారం, హత్య కేసును సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న కారణంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సమయంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌గా పనిచేసిన వినీత్ గోయల్, డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వర్తించిన ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై చర్యలు తీసుకొంది. కేసు దర్యాప్తులో నిబంధనలు పాటించకపోవడం, కేసును ఉపసంహరించుకోవాలంటూ బాఽధితురాలి తల్లిదండ్రులకు లంచం ఇవ్వజూపడం, అనుమతి లేకుండా విలేకరుల సమావేశం పెట్టడం వంటి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేసినట్టు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. వారిపై శాఖాపరమైన దర్యాప్తు జరపడంతో పాటు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.