హైదరాబాద్ లక్ష్యం 259
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:19 AM
చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూప్ బి మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడుతోంది. మూడో రోజు బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌటైంది...
ప్రస్తుతం 13/2
చత్తీస్‌గఢ్ రెండో ఇన్నింగ్స్ 254
సికింద్రాబాద్: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూప్ బి మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడుతోంది. మూడో రోజు బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌటైంది. తనయ్ (34) ఫర్వాలేదనిపించాడు. ధర్మేంద్రసింగ్ జడేజాకు ఐదు, దేవ్ ఆదిత్య.. జయంత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించినచత్తీస్‌గఢ్ 254 రన్స్‌కు ఆలౌటైంది. మయాంక్ (81), సంజీత్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. రక్షణ్, అనికేత్‌లకు మూడేసి, రుతిక్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 259 పరుగుల ఛేదనలో హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో అభిరత్ (8), రాహుల్ (3) ఉన్నారు. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో హైదరాబాద్ విజయానికి మరో 246 రన్స్ కావాలి. చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ
అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!