Share News

స్టార్లతో కళకళ

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:34 AM

ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ సీజన్‌కు ఆదివారం తెరలేవనుంది. ఎలీట్‌ గ్రూప్‌ ‘బి’లో తలపడుతున్న హైదరాబాద్‌ జట్టుకు మొదటి రెండు మ్యాచ్‌ల్లో పేసర్‌ సిరాజ్‌...

స్టార్లతో కళకళ

నేటి నుంచే రంజీ సమరం

బరిలో రాహుల్‌, జైస్వాల్‌, జడేజా

సిరాజ్‌ సారథ్యంలో హైదరాబాద్‌

త్రిపుర జట్టుతో ఢీ

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ సీజన్‌కు ఆదివారం తెరలేవనుంది. ఎలీట్‌ గ్రూప్‌ ‘బి’లో తలపడుతున్న హైదరాబాద్‌ జట్టుకు మొదటి రెండు మ్యాచ్‌ల్లో పేసర్‌ సిరాజ్‌ సారథ్యం వహిస్తున్నాడు. జింఖానా గ్రౌండ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో త్రిపుర జట్టుతో హైదరాబాద్‌ తలపడనుంది. వైస్‌-కెప్టెన్‌గా ఎంపికైన మరో పేసర్‌ సీవీ మిలింద్‌..సిరాజ్‌ తర్వాత జట్టును నడిపిస్తాడు. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, రాహుల్‌ సింగ్‌, హిమతేజ, అభిరథ్‌ రెడ్డి, వికెట్‌ కీపర్‌ రాహుల్‌ రాధేశ్‌పై హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ప్రధానంగా ఆధారపడి ఉంది. స్పిన్‌ విభాగానికి తనయ్‌ త్యాగరాజన్‌, అనికేత్‌ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. సిరాజ్‌, రక్షణ్‌రెడ్డి పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకుంటారు. మణిశంకర్‌ మురాసింగ్‌ కెప్టెన్సీలో బరిలో దిగుతున్న త్రిపుర జట్టులో భారత జట్టు మాజీ ఆటగాడు హనుమ విహారి ఆడుతుండడం విశేషం. గ్రూప్‌ ‘ఎ’లో బరిలో దిగుతున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ జమ్మూ కశ్మీర్‌..మధ్యప్రదేశ్‌ను ఢీకొననుంది. నాలుగు ఎలీట్‌ గ్రూపుల్లో ఒక్కో దానిలో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. ఇక ఒక ప్లేట్‌ గ్రూపులో ఆరు జట్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కేఎల్‌ రాహుల్‌, యశస్వీ జైస్వాల్‌, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి టీమిండియా స్టార్లు ఆడుతుండడంతో తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక, రాహుల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కర్ణాటకతో ఆంధ్ర రంజీ జట్టు తలపడనుంది.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 11 , 2026 | 05:34 AM