టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్థాన్
ABN , Publish Date - May 16 , 2026 | 04:07 PM
ఇంగ్లండ్ వేదికగా త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 సభ్యులతో కూడిన జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు మహిళల టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లో పాల్గొనే వివిధ దేశాలు తమ జట్లను ప్రకటిస్తు్న్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఇవాళ15 సభ్యులతో కూడిన జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫాతిమా సనాను నియమించారు. వరుసగా రెండోసారి సనానే టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టును ముందుండి నడిపించనుంది.
పాకిస్థాన్ ప్రకటించిన తమ జట్టులో పలువురు ప్లేయర్లు తొలిసార ప్రపంచకప్ ఆడుతున్నారు. ఎమాన్ ఫాతిమా, నతాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సైరా జబీన్, తస్మియా రుబాబ్‌కు ఇదే తొలి వరల్డ్‌కప్ కావడం గమన్హారం. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో ఆయేషా జాఫర్, ఫాతిమా సనా మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసొచ్చిన అంశం. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో పాక్ కెప్టెన్ సనా ప్రపంచ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్(15 బంతుల్లో 50 పరుగులు) గా రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో బ్యాటింగ్ విభాగంలో గుల్ ఫిరోజా, మునీబా అలీ, సనాలపై పాకిస్థాన్ ఆశలు పెట్టుకుంది. ఇక స్పిన్ విభాగంలో సదియా ఇక్బాల్, నష్రా సంధు, తుబా హసన్ కీలక పాత్ర పోషించనున్నారు. పేస్ విభాగంలో ఫాతిమా సనా, డయానా బేగ్ ముందుండి నడిపించనున్నారు.
మహిళా టీ20 ప్రపంచకప్2026లో పాకిస్థాన్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో పాక్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్ జట్టు వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్ మ్యాచ్‌లకు ముందు పాక్ రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. జూన్ 6న శ్రీలంకతో, జూన్ 9న స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పాక్.. వెస్టిండీస్‌తో కలిసి ఐర్లాండ్‌లో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొననుంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ టోర్నీలోనూ కొనసాగనుంది.
పాకిస్థాన్ జట్టు:
ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, తస్మియా రుబాబ్, తస్మియా రుబాబ్
రిజర్వ్‌డ్: అంబర్ కైనాట్, మోమినా రియాసత్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా మరియు ఉమ్-ఎ-హని
ఇవి కూడా చదవండి:
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి