కివీస్ ‘ఎ’ 218/3
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:03 AM
భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ పోరాడుతోంది...
క్రైస్ట్‌చర్చ్: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ పోరాడుతోంది. రెండో రోజు ఆదివారం వెలుతురులేమితో ఆట ముగిసే సమయానికి ఆతిథ్య కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 218/3 స్కోరు చేసింది. 13/3 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును మాథ్యూ బోయ్‌లే (107 బ్యాటింగ్), ఫాక్స్‌క్రాఫ్ట్ (80 బ్యాటింగ్) ఆదుకొని నాలుగో వికెట్‌కు అజేయంగా 205 పరుగులు జోడించారు. ముకేశ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 291/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ 346 పరుగులకు ఆలౌటైంది. జురెల్ (105) శతకం చేయగా, అతనికి ఆకాశ్ దీప్ (68) సహకరించాడు.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్