Share News

ముంబై బౌలింగ్‌ కోచ్‌ మలింగపై వేటు

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:25 AM

ముంబై ఇండియన్స్‌లో సుదీర్ఘకాలం ఆటగాడిగా, ఆ తర్వాత బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన మాజీ పేసర్‌ లసిత్‌ మలింగపై వేటు పడింది...

ముంబై బౌలింగ్‌ కోచ్‌ మలింగపై వేటు

ముంబై: ముంబై ఇండియన్స్‌లో సుదీర్ఘకాలం ఆటగాడిగా, ఆ తర్వాత బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన మాజీ పేసర్‌ లసిత్‌ మలింగపై వేటు పడింది. కొన్ని సీజన్లుగా జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నందున తమ కోచింగ్‌ సిబ్బందిలో యాజమాన్యం మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా బౌలింగ్‌ కోచ్‌లు మ లింగ, పారస్‌ మాంబ్రేలతో పాటు ఫీల్డింగ్‌ కోచ్‌ కార్ల్‌ హాప్కిన్సన్‌లపైనా వేటు వేసింది. హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్‌ కొత్త ఫీల్డింగ్‌ కోచ్‌గా జట్టులో చేరే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన మలింగ 2013, 2015, 2017, 2019 సీజన్లలో ముంబై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 05:25 AM